ఓ వ్యక్తి వల్ల ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-19 08:08:15  IST  )

గత ఐదేళ్లు ఓ వ్యక్తి వల్ల ఎక్కడ చూసినా భయం, విధ్వాంసాలేనని, ఉగాది పండగ కూడా చేసుకోలేని పరిస్థితి ఉండేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ప్రసంగించారు...

ఓ వ్యక్తి వల్ల  ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్లు ఓ వ్యక్తి వల్ల ఎక్కడ చూసినా భయం, విధ్వాంసాలేనని, ఉగాది(Ugadi Fest) పండగ కూడా చేసుకోలేని పరిస్థితి ఉండేదని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం(Vijayawada Tummalapalli Kalakshetram)లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను డెవలప్‌మెంట్ చేస్తున్నామని తెలిపారు. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీలేకుండా పోరాటం చేస్తామని తెలిపారు. నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. ఈసారి మూడోసారి తాను కృష్ణా పుష్కరాలను నిర్వహించబోతున్నానని తెలిపారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టాలు, సుఖాలు ఉంటాయని తెలిపారు. పండగలు ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story