పండుగ వేళ పరిశ్రమలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-19 12:24:28  IST  )

చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేదే దీపావళి పండుగ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

పండుగ వేళ పరిశ్రమలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేదే దీపావళి పండుగ(Diwali Festival) అని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandhrababu Naidu) తెలిపారు. అలాంటి ఈ పండుగ వేళ పరిశ్రమల( Industries)కు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో...ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలివిడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story