- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తాం: సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది ఎయిర్స్ ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: వచ్చే సంవత్సరం ఎయిడ్స్(Aids) ఫ్రీ ఏపీగా డిక్లేర్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ సిస్టం(Family Card Benefit System) ద్వారా జూన్ నాటికి సమగ్ర కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. జనాభా విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిందని, 60 ఏళ్లు దాటితే ఏ పనీ చేయలమేనే భావన పోవాలని చెప్పారు. ఏపీలో మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీకి శ్రీకారం చుడతామన్నారు. సాధారణ ప్రసవాలు పెరగాలని, సిజేరియన్లు తగ్గాలని సీఎం చంద్రబాబు సూచించారు. సంజీవని ద్వారా నాలుగు నెలల్లో 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్ర్కీనింగ్ చేస్తామని చెప్పారు. కేఆర్ అండ్ గ్రో ద్వారా మాతాశిశు ఆరోగ్యం, పెరుగదల వివరాలను నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.






