- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతి సేద్యంలో ఏపీ టాప్: సీఎం చంద్రబాబు
ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలో టాప్‌లో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలో టాప్‌లో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. స్విట్జర్లాండ్(Switzerland)లో భారత రాయబారి మృదుల్ కుమార్(Indian Ambassador Mridul Kumar)తో సీఎం చంద్రబాబు భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరులకొరతతో ఉన్నాయని తెలిపారు. భారత దేశం యువశక్తితో సిద్దంగా ఉందన్నారు. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందని చెప్పారు. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉందన్నారు. ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
భేటీలో చర్చించిన అంశాలివే...
అంతకుముందు స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై భారత రాయబారి మృదుల్ కుమార్‌తో చంద్రబాబు చర్చించారు. ‘ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలి. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్ అండ్ డీ కేంద్రాలు వంటి రంగాల్లోనూ సహకరించాలి. ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలి.’’ అని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను చంద్రబాబు కోరారు.






