ఇక ఇంచు కూడా కదిలించలేరు: అమరావతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఇక ఇంచు సైతం అమరావతిని కదిలించలేరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో ఆయన స్పందించారు

ఇక ఇంచు కూడా కదిలించలేరు: అమరావతిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇక ఇంచు సైతం అమరావతి(Amaravati)ని కదిలించలేరని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Legalization Bill) లోక్ సభ(Lok Sabha)లో ఆమోదం పొందడంతో ఆయన స్పందించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించిన ఆయన వైసీపీది మూడు ముక్కలాట అని, మూడు రాజధానుల నినాదమని చెప్పారు. కనీసం ప్రత్యేక అసెంబ్లీకి కూడా వైఎస్ జగన్ రాలేదని విమర్శించారు. తన జీవితంలో ఇటువంటి వ్యక్తిని చూడలేదని ఎద్దేవా చేశారు.ఇక రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతం, శ్మశానం అంటూ హేళన చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందన్నారు. స్వర్ణాంధ్రపై 6 సూత్రాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రూ. 4 వేలు మనం తప్ప దేశంలో ఎక్కడా కూడా పెన్షన్ ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story