ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Ramesh Naini |

ధాన్యం కొనుగోళ్లు సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) సమీక్ష నిర్వహించారు.

ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లు సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు.

స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని చెప్పారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని కోరారు. వర్చువల్ గా మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షకు హజరయ్యారు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Next Story