- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలవనరులశాఖపై సమీక్ష.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్ర జలవనరులశాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర జలవనరులశాఖ(Water Resources Department )పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల(Irrigation Projects)లో అనుకున్న లక్ష్యాల మేరకు పనులు జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో అన్ని పనులు జరగాలని, లేనిపక్షంలో సహించేది లేదని తెలిపారు. 2027 జూన్ కల్లా పోలవరం పనులు జరగాలని సూచించారు. పోలవరం పనులు పూర్తి అయి ఫలితాలు వచ్చే సమయానికి సుజల స్రవంతిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భూగర్భ జలాల(Ground Water) పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతేకాదు నలుగురు మంత్రులతో కమిటీని నియమించాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పర్యటక శాఖపైనా సమీక్ష
మరోవైపు పర్యటక శాఖపైనా సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్, అధికారులు పాల్గొన్నారు. పర్యటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై సీఎం చర్చించారు. హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టుల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. కేంద్రం సమన్వయంతో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.






