తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్స్.. సీఎం ప్రశంసల వర్షం

by Vemula.Srinu Prasad |

తైవాన్‌లో జరిగిన స్కేటింగ్ పోటీల్లో తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్స్ రావడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు..

తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్స్.. సీఎం ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తైవాన్‌(Taiwan)లో ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌(Artistic Roller Skating Championship) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగమ్మాయి మెరిసింది. అద్భుతమైన ప్రతిభ చూపి బంగారు పతకాన్ని సాధించారు. విశాఖ(Visakha)కు చెందిన దొంతారా గ్రీష్మ(Dontara Grishma)కు చిన్నప్పటి నుంచి స్కేటింగ్‌ అంటే ఇష్టం. ప్రతి రోజూ స్కేటింగ్‌లో సాధన చేసేవారు. స్కూలు, కాలేజీల్లో జరిగిన స్కేటింగ్‌లో అత్యద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ చాలా పతకాలు ఆమె ఖాతాలో వేసుకున్నారు. గీష్మ ప్రతిభను గుర్తించా డిస్ట్రిక్, స్టేట్, నేషన‌ల్ లెవల్ పోటీల్లో అవకాశం కల్పించారు. ఈ పోటీల్లోనూ ఆమె పథకాలు సాధించారు.

అయితే తైవాన్‌లో జరుగుతున్న ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్‌కు భారత దేశం తరపున గ్రీష్మను ఎంపిక చేశారు. దీంతో ఆమె అక్కడ జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని అత్యద్భుతంగా రాణించారు. దీంతో చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు గ్రీష్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు( Cm Chandrababu Naidu) సైతం స్పందించారు.

‘‘తైవాన్‌లో తెలుగమ్మాయి, పతకాలను సాధించడం రాష్ట్రానికి గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో రాష్ట్రానికి, దేశానికి గ్రీష్మ మంచి పేరు తీసుకు వస్తుందని ఆకాంక్షిస్తున్నా.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Next Story