తిరువూరులో విభేదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-31 14:44:38  IST  )

తిరువూరు విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు...

తిరువూరులో విభేదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరువూరు(Tiruvuru)లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Mla Kolikapudi Srinivasarao), ఎంపీ కేశినేని చిన్ని(Mp Kesineni Chinni) మధ్య తలెత్తిన విషయం తెలిసిందే. బహిరంగంగానే వాళ్లిద్దరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. ఈ మేరకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. చిన్ని, కొలికపూడి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. వాళ్లిద్దర్నీ పిలిచి మాట్లాడాలని, వివరణ తీసుకుని ఆ నివేదికను తనకు అప్పగించాలని క్రమ శిక్షణ కమిటీని ఆదేశించారు.

లండన్ పర్యటన అనంతరం తాను సైతం ఇద్దరితో మాట్లాడతానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదన్నారు. విభేదాలు కొలిక్కి రావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు ఇవ్వని కొందరు ఎమ్మెల్యేల తీరుపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పట్టించుకునే తీరికి లేదా అంటూ మండిపడ్డారు. అలాంటి జాబితా రెడి చేసి తనకు అందజేయాలన్నారు. ఒక నుంచి ప్రతి వారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, తుపాను ప్రభుత్వ సేవలను ప్రజలకు వివరించాలని చెప్పారు. వైసీపీ దుష్ప్రచారాలకు దీటుగా జవాబివ్వాలని ఆదేశించారు. లండన్(London) పర్యటన ముగిసిన తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీని ప్రకటిస్తానని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story