- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబును చూడాలన్న పెద్దాయన.. వైరల్ వీడియోపై స్పందించిన సీఎం
సీఎం చంద్రబాబు నాయుడంటే.. ఆంధ్రా ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఏనాటి నుంచి ఆయన్ను ఆరాధిస్తున్నారో ఓ పెద్దాయన చెప్పిన మాటల్లో అర్థమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడంటే.. ఆంధ్రా ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఏనాటి నుంచి ఆయన్ను ఆరాధిస్తున్నారో ఓ పెద్దాయన చెప్పిన మాటల్లో అర్థమవుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆ పెద్దాయన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అతని మనువడు సరదాగా తీసిన వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు. ఈనెల 9న పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సిద్ధాంతం వస్తున్నారని మనవడు చెప్పగానే.. ఆరోజు తనను తీసుకెళ్లాలని అడిగిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తనను కలవాలని ఆశగా ఎదురుచూస్తున్న ఆ పెద్దాయన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం అని రిప్లై ఇచ్చారు. రాష్ట్రంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడితో మనవడు చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో చంద్రబాబుని ఎప్పుడైనా దగ్గరగా చూశావా తాత అని అడగ్గా.. హైదరాబాద్లో ఉంటారని చెప్తారు కానీ.. ఎప్పుడూ చూడలేదు అని ఎంతో అమాయకంగా చెప్పారు. ఆయన్ను కలుస్తావా.. పక్కూరికి వస్తున్నారని చెప్పగా.. అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా.. అలా దూరం నుంచి చూసి, దండం పెట్టుకుని వచ్చేద్దామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వీడియో సీఎం దృష్టికి చేరడంతో.. సిద్ధాంతంలో మనం రేపు కలుద్దామని బదులిచ్చారు. సామాన్యుడి కోరికపై స్పందించి బదులివ్వడం నెటిజన్ల మనసుల్ని దోచుకుంది. మా సీఎం మనసున్న మహారాజు అంటూ.. నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.






