తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-09 05:57:05  IST  )

తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అందరికీ అన్నగా రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ రక్షణ కల్పించి, అందరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు.

"నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ల అనుబంధం వ్యక్తం చేస్తూ ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని రాఖీ పండుగ సందర్భంగా మరో సారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికి మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు." అని సీఎం చంద్రబాబు చేసిన పోస్టులో పేర్కొన్నారు.

అలాగే.. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా డెవలప్ చేసి.. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నిపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఏడాది సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్ని వివరించి మున్ముందు చేపట్టే కార్యక్రమాలపై నేడే నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.

Next Story