సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. వైకుంఠ ఏకాదశి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

by Ramesh Naini |

తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత పవిత్రంగా, క్రమబద్ధంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.

సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. వైకుంఠ ఏకాదశి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత పవిత్రంగా, క్రమబద్ధంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనంలో 97 శాతం మంది సామాన్య భక్తులే దర్శనం చేసుకోవడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనం ద్వారా మొత్తం 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించడం గొప్ప విజయమని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీవారి అనుగ్రహానికి భక్తులను పాత్రులను చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

వైకుంఠ ఏకాదశి విజయవంతం

క్యూలైన్ల పర్యవేక్షణ, అన్నప్రసాదం పంపిణీతో పాటు భక్తులకు కల్పించిన సౌకర్యాల విషయంలో అధికారులు తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర నిర్వహణ వల్ల భక్తులు సంతృప్తి చెందారని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులు కూడా కలిసి రావాలని కోరారు.

Next Story