మీ కుటుంబ నిర్ణయం ఎంతో ఆదర్శం: బాలుడి అవయవదానంపై సీఎం ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-04 15:03:41  IST  )

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన బాలుడి అవయవదానంపై సీఎం చంద్రబాబు ప్రశంసించారు...

మీ కుటుంబ నిర్ణయం ఎంతో ఆదర్శం: బాలుడి అవయవదానంపై సీఎం ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) ఓర్వకల్లు(Orvakallu)లో15 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి బ్రెయిన్ డెడ్ అయింది. ఈ మేరకు తమ కుమారుడి అవయవాలను జిల్లాకు చెందిన కుటుంబం దానం చేసింది. దీంతో ఐదుగురికి ప్రాణం పోశారు. ఈ గొప్ప త్యాగంపై తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. తమరు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు కొనియాడారు.

మరోవైపు తిరుపతి పద్మావతి హృదయాలయ వైద్యులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేయడంపై వైద్య బృందాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు.

Next Story