కొత్త కార్మిక చట్టాలను ప్రశంసించిన సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (New Labour Code) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రశంసించారు.

కొత్త కార్మిక చట్టాలను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను (New Labour Code) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 1991 ఆర్థిక ఉదారవాదం తర్వాత పెద్ద సంస్కరణలలో ఒకటిగా కొత్త కార్మిక కోడ్‌లను పేర్కొన్నారు. శనివారం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని సీఎం పంచుకున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా భారత కార్మిక విధానాలను సమన్వయం చేసే ఈ చట్టాలు కార్మికుల భద్రతను బలపరుస్తాయని అన్నారు. న్యాయమైన వేతనాలను నిర్ధారిస్తాయని ఆయన అన్నారు. ఈ కోడ్‌లు కార్మికుల గౌరవాన్ని కాపాడటమే కాకుండా, గిగ్ వర్కర్‌లకు రక్షణ కల్పిస్తాయని పేర్కొన్నారు. మహిళల సాధికారత, సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు దోహదపడతాయన్నారు. భారతదేశాన్ని భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనే ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా కీలకమైన అడుగుగా అభివర్ణించారు. ఈ సంస్కరణలను అమలు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఆయన ప్రశంసించారు.

Next Story