- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నిత్య విద్యార్థిని.. నా గురువుని ఎప్పటికీ మరచిపోలేను : సీఎం చంద్రబాబు నాయుడు
తాను నిత్య విద్యార్థిని అని, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: తాను నిత్య విద్యార్థిని అని, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో పాల్గొని.. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన గురువును గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో భక్తవత్సలం అనే టీచరే స్ఫూర్తిని నింపారని తెలిపారు. రాజకీయ నాయకుల పిల్లలు సాధారణంగా చదువుకోరన్న సీఎం.. లోకేష్ చదువు బాధ్యతలు తన భార్యే చూసుకుందని, లోకేష్ చదువు విషయంలో మాత్రం ఆ క్రెడిట్ భువనేశ్వరికే చెందుతుందని కితాబిచ్చారు. విద్యార్థుల జీవితాల్లో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారనే డీఎస్సీ విషయంలో జాప్యం చేయనన్నారు. నేడు తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు కూడా అండగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
తన హయాంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాదని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే బాధ్యత తనదని తెలిపారు. టీచర్లు పిల్లలకు ఎలాంటి సిలబస్ అవసరమో రివైజ్ చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా టెక్నాలజీకి తగ్గట్లుగా అప్డేట్ అవ్వాలని, పిల్లల్లో క్రియేటివిటీని పెంచాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని సూచించారు.






