- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని భరోసా కల్పించిన సీఎం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ పేదల సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లె (Beggipalle) గ్రామంలో జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా’ (NTR Bharosa) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, అలాగే వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛనును ఆయన స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను ఈ సందర్భంగా అడిగారు. అదే విధంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా తమ గడప వద్దకు వచ్చి పింఛను అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కాకుండా, 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.






