- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ నిరుపేదలకు శుభవార్త..నేడు ఆ డబ్బులు పంపిణీ
ఒకటో తారీకు అయిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేరుగా ఈ పెన్

*నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన*
*ఉంగుటూరు పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం*
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇవాళ ఒకటో తారీకు అయిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేరుగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏలూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉంగటూరు నియోజకవర్గంలోని గోపినాథ పట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు.
అదే సమయంలో నల్లమాడులో P4 మార్గ దర్శకులు, బంగారు కుటుంబాలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖిలో కూడా పాల్గొంటారు. అనంతరం ఉంగుటూరులో తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం కూడా చేయనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3:35 గంటలకు ఏలూరు జిల్లా పర్యటన ముగించుకొని, తిరిగి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు. ఈ మేరకు ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ సర్కారుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలకుల అరాచకాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని పేర్కొన్నారు. వాళ్లు చేసిన అవినీతిని గ్రౌండ్ స్థాయిలో కి తీసుకువెళ్లాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లను ప్రజలకు అప్పగించబోతున్నట్లు వివరించారు. పార్టీ కార్యక్రమాలకు డిసెంబర్ క్యాలెండర్ రూపొందించామని కూడా ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవం ఇచ్చినట్లు గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి, తగిన న్యాయం చేస్తామన్నారు. పార్టీలో తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే, తాట తీస్తానని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.






