- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమ్మిన సిద్ధాంతం కోసం.. బలి దానానికైనా వెనుకాడని వ్యక్తి ఏసుప్రభువు : సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన..

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ.. ఆయన చూపిన బాటలో నడవాలని క్రిస్టియన్లకు సూచించారు. రాష్ట్రంలో క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూతను అందించినది కూటమి ప్రభుత్వమేనన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి మత పెద్దలకు తినిపించి, కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మిచిన రోజు మనందరికీ పండుగైందని, ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఆయన సందేశం ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. క్రీస్తు బోధనలను, ఆయన చూపిన బాటను క్రీస్తులు అనుసరించాలని సూచించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం.. బలి దానానికైనా వెనుకాడని ఆయన గొప్పతనం నుంచి అందరూ స్ఫూర్తిని పొందాలన్నారు. ప్రేమ తత్వాన్ని పెంచుకుని, ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండాలని బైబిల్ చెబుతోందన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
READ MORE ....
‘ఏ అంశంలోనైనా ఏపీ ఫాస్ట్ లెర్నర్’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు






