- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం కీలకం నిర్ణయం.. ప్రతి అర్హుడికీ ఇల్లు లేదా స్థలం..
వచ్చే నాలుగేళ్లల్లో ప్రతి అర్హుడికీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు..

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నాలుగేళ్లల్లో ప్రతి అర్హుడికీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న డేటాను వినియోగించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు(House) లేదా ఇంటి స్థలం(Housing land) అందించాలని సూచించారు. ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హులకు అర్బన్ ఏరియా(Urban area)లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు భూమిని గుర్తించాలని సూచించారు.
అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకపోతే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో సెంటు పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. సెంట్ పట్టా భూమి నిరుపయోగంగా ఉంటే... ఆ భూమిని ఎంఎస్ఎంఈలు వంటి వాటికి కేటాయించాలని చెప్పారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పర్యాటకం పెరిగేలా ఎకోసిస్టాన్ని తీసుకురావాలన్నారు. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా టౌన్ షిప్‌లను అభివృద్ధి చేయాలని తెలిపారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా పెద్ద భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.






