పింగళి వెంకయ్య వర్ధంతి .. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నివాళులు

by Jakkula.Mamatha |

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు.

పింగళి వెంకయ్య వర్ధంతి .. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నివాళులు
X

దిశ,వెబ్‌డెస్క్: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త, గొప్ప దేశభక్తుడు, రచయిత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందాం అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పింగళి వెంకయ్య తెలుగు వారవ్వడం మనకు గర్వకారణం. భారత జాతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అలాగే, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘‘జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతైనా సాధించగలం అని వివేకానంద చరిత్ర మనకు చెబుతుంది. కేవలం తన మూడు పదుల జీవిత కాలంలోనే భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేయడంతో పాటు.. యువతను కార్యశూరులుగా తయారుచేసే స్ఫూర్తిదాయక బోధనలను అందించిన స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు’’ అని ట్విట్టర్ వేదికగా సీఎం పేర్కొన్నారు.

Next Story