- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులు
by Ramesh Naini |
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు పార్థివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు పార్థివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి వెళ్లిన వారు ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా జీఎన్ నాయుడుతో తనకున్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రీజెన్సీ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలోనూ, సమాజ సేవలోనూ ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన మరణంతో తెలుగు ప్రజలు ఒక మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
Next Story






