తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల్లో ఒకరు, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు.

తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల్లో ఒకరు, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. "తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు ఆయన. ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత నాయకుడి సేవలను స్మరించుకుందాం." అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

"ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ధైర్య సాహసాలు, ప్రజాసేవ, దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదాం." అని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు.

Next Story