- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
by Naga Rani Yarlagadda |
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబునాయుడు..

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ఎయిర్ పోర్టులో భేటీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారం వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం. పలువురు రాష్ట్రమంత్రలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.
నిర్మలమ్మతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పెద్ద అవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లి ఆయన్ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామ్మోహనరావు తల్లి వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Next Story






