ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. ఐదుగురు కేంద్రమంత్రులతో భేటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-10 04:36:24  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. జన్ పథ్ నివాసంలో బస చేశారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. ఐదుగురు కేంద్రమంత్రులతో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. జన్ పథ్ నివాసంలో బస చేశారు. నేడు ఐదుగురు కేంద్రమంత్రులతో విరివిగా భేటీ కానున్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, జలజీవన్ మిషన్ పథకానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై చర్చిస్తున్నారు. ఆయనతో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్ లతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు అందాల్సిన సహాయం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తావనలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఏపీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రులతో సమావేశాలు ముగిశాక సీఎం తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్తారు.

Next Story