- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
మారిషస్ అధ్యక్షుడితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మారిషస్ అధ్యక్షుడితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాలను ఆయనకు వివరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మారిషస్‌లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను తెలుసుకున్నానని. తెలుగు వారిపట్ల ఆయన చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్
ఇదిలా ఉండగా తెలుగు మహాసభలపై సీఎం చంద్రబాబు నాయుడు మరో ట్వీట్ చేస్తూ.. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. కవిత్రయం నుంచి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నామని తెలిపారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నామని పేర్కొన్నారు.
హాజరైన ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్
భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుందని, మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే.. అని అన్నారు. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని వారికి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.






