కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

by Ramesh Naini |

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చర్యలను సీఎం అమిత్ షాకు వివరించినట్లు తెలిసింది.

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు లభించిన సానుకూల స్పందనపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఈ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు క్రెడాయ్ నేషనల్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Next Story