భారత హై కమిషనర్ ను కలిసిన సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లండన్ (London) పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖులను కలుస్తున్నారు.

భారత హై కమిషనర్ ను కలిసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లండన్ (London) పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. యుకెలోని వివిధ యూనివర్సిటీలు ఏపీతో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై చర్చించారు. ఏపీలో ఆయా యూనివర్సిటీ కేంద్రాలను ప్రారంభించే అంశంపై సమాలోచనలను చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకునే విషయమై మాట్లాడారు. ఏపీలోని విద్యా సంస్థలతో లండన్ లోని యూనివర్సిటీలు (Universities) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే విషయం గురించి వివరించారు. యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య విద్యార్థుల మార్పిడి అంశం ఏపీతో పాటు దేశానికి కూడా మేలు చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్, బయో జెనెటిక్స్, ఖనిజాల వెలికితీత, మెటల్స్ అంశాల్లో ఏపీ, యుకె యూనివర్సిటీల భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి కూలంకశంగా చర్చించారు. ఏఐ, సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ, కోర్ ఇంజనీరింగ్, మెరైన్ ఇండస్ట్రీ 4.0లో సహకారం గురించి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu), భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పరస్పర అభిప్రాయాలను పంచుకున్నారు.

Next Story