సాయంత్రం గవర్నర్‌తో CM చంద్రబాబు భేటీ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చర్చ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 09:13:15  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్‌ ఎస్.అబ్దుల్ నజీర్‌ (Justice S.Abdul Nazir)తో మర్యాదపూర్వకంగా భేటీ కాబుతోన్నారు.

సాయంత్రం గవర్నర్‌తో CM చంద్రబాబు భేటీ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్‌ ఎస్.అబ్దుల్ నజీర్‌ (Justice S.Abdul Nazir)తో మర్యాదపూర్వకంగా భేటీ కాబుతోన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్న బిల్లులు, రాష్ట్రంతో పాటు వివిధ పార్టీ సభ్యులు ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు, GST వసూళ్లు, అప్పుల భారం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యను సీఎం, గవర్నర్‌కు వివరించనున్నారు. విశాఖపట్నం అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షించేందుకు జరుగుతున్న కృషి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ టెక్నాలజీ (Drone Technology) వంటి కొత్త ప్రాజెక్టులపై కూడా డిస్కస్ చేయనున్నారు. సుమారు గంటకు పైగా వారి భేటీ కొనసాగుతుందని.. ఈ సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని లోక్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story