పెన్షన్ల పంపిణీ వేళ... పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-30 13:42:08  IST  )

పెన్షన్ల పంపిణీ వేళ పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు...

పెన్షన్ల పంపిణీ వేళ... పార్టీ నేతలకు  సీఎం చంద్రబాబు కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: పేదలకు పెన్షన్ల(Pensions) పంపిణీకి సర్వంసిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల నగదు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పేదల సేవలో కార్యక్రమం’లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆయన కీలక సూచనలు చేశారు. ‘పేదల సేవలో కార్యక్రమం‘లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. అంకితభావంతో పేదలకు పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించారు. ప్రజల్లో నిరంతరం ఉండాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని, వెంటనే పరిష్కరించాలని చెప్పారు. సమస్యలపై స్పందించడం నాయకుడి బాధ్యత అని చంద్రబాబు సూచించారు. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు తెలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story