ఢిల్లీలో సీఎం.. కాసేపట్లో ప్రధానితో భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-13 10:01:57  IST  )

అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు..

ఢిల్లీలో సీఎం.. కాసేపట్లో ప్రధానితో భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) నుంచి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఢిల్లీ(Delhi)కి బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో ప్రధాని మోడీ(Pm MOdi)తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మోడీని సీఎం అహ్వానించనున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్‌‌ ద్వారా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రూ. 84 వేల కోట్లతో డేటా సెంటర్‌ను మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్‌‌‌తో ఒప్పందం చేసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని కాసేపట్లో కలిసి ఆహ్వానపత్రిక అందించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీని కలిసేందుకు రాష్ట్ర ఎంపీలు ఏర్పాట్లు చేశారు.

Next Story