దుబాయ్ టూర్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు.. ప్రధాన లక్ష్యం అదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-22 05:33:36  IST  )

దుబాయ్ టూర్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు.. ప్రధాన లక్ష్యం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ దుబాయ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఉండవల్లి క్యాంప్ ఆఫీస్‌ నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు బయలుదేరారు. ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం కార్యాలయ సీక్రటరీ కార్తీకేయ మిశ్ర, పరిశ్రమల విభాగం సీక్రటరీ ఎన్ యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సైకాంత్ వర్మ, రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి‌రెడ్డి దుబాయ్‌కి వెళ్లనున్నారు.

కాగా, అక్టోబర్ 22 నుంచి 24 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వారి పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ (Confederation of Indian Industry) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించాలని ఈ టూర్‌లో సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్‌ హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేలా ఆయా కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు.

READ MORE ...

లక్ష్మీ నాయుడు హత్య కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం

Next Story