ప్రవాసాంధ్రులకు గుడ్ న్యూస్.. బీమా పథకం ప్రారంభం

by Vemula.Srinu Prasad |

ప్రవాసాంధ్రులకు సీఎం చంద్రబాబు బీమా పథకాన్ని ప్రారంభించారు...

ప్రవాసాంధ్రులకు గుడ్ న్యూస్.. బీమా పథకం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రవాసాంధ్రుల(Andhras) సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ(APNRT Society) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) దుబాయ్‌(Dubai)లో ప్రారంభించారు. విదేశాల్లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులతో పాటు వలస కార్మికులు, విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్‌ను సందర్శించగలరు.

Next Story