- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఎన్.జి.రంగా జీవిత ఘట్టాలను వివరించే ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు తిలకించారు.

దిశ, వెబ్‌డెస్క్: పద్మ విభూషణ్ ఆచార్య ఎన్.జి.రంగా 125వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఎన్.జి.రంగా జీవిత ఘట్టాలను వివరించే ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. అనంతరం ఎన్.జి. రంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయామని రాష్ట్రంలో ఏ ఒక్కరైతు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఇప్పటికే ఆదుకున్నామన్న ఆయన.. తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు పంటల బీమా చెల్లించి అండగా నిలిచామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లను పూర్తి చేశామని, కరవును శాశ్వతంగా నివారించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.






