- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రులతో భేటీ.. కీలక ప్రతిపాదనలు అందజేసిన సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుసగా సమావేశమవుతూ ఏపీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Raj Nath Singh)తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. ముందుగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయంపై అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుసగా సమావేశమవుతూ ఏపీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Raj Nath Singh)తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. ముందుగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయంపై అభినందనలు తెలిపారు. రక్షణ తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన వ్యూహాన్ని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన సహకారం, వ్యూహాత్మక సంస్థాపనలతో కూడిన సమగ్ర ప్రణాళికను వివరించారు. ఈ ప్రతిపాదనలలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ యూనిట్ల అభివృద్ధి, కీలక తయారీ యూనిట్ల పునరుద్ధరణ, స్వదేశీ విమానయాన కార్యక్రమాలకు మద్దతు, టెస్టింగ్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేకంగా స్థానికంగా లభించే సామర్థ్యాలను ప్రోత్సహించడానికి తగిన రక్షణ కేంద్రాల సృష్టి ఉన్నాయి. పటిష్టమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, క్రియాశీలక విధాన వాతావరణంతో ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ ఉత్పత్తి, ఆవిష్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు.
అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి పోలవరం-బనకచెర్ల (Polavaram - Banakacherla Project) అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద నీటిని ఆంధ్రప్రదేశ్‌లోని కరవు పీడిత ప్రాంతాలకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్, లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు, నల్లమల కొండల గుండా సొరంగాలు వంటి మూడు ప్రధాన భాగాలతో కూడిన నీటి బదిలీ వ్యవస్థ ఉంటుంది. జల్ జీవన్, బ్లూ రివల్యూషన్, మేక్ ఇన్ ఇండియా వంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న హక్కును కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను డీపీఆర్ త్వరలో సమర్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లడానికి తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ఆయన అభ్యర్థించారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi)ని కలిసిన సీఎం.. పీఎం సూర్యఘర్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించాలని కోరారు. అలాగే.. రాష్ట్రానికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ (Rooftop Solar Panels) కేటాయింపు పై ప్రతిపాదనలను అందించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు 20 లక్షల సోలార్ ప్యానల్స్, బీసీ గృహాలకు 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా రూ.10 వేల సబ్సిడీ అందించాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఏపీని బెంచ్ మార్క్‌స్టేట్‌గా దేశంలో మార్చేందుకు సహకరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు.






