Tdp Mahanadu: రాష్ట్ర విభజనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

విభజనతో రాష్ట్రానికి రెండు దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విభజనతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ తెలంగాణను వెళ్లిందని ఆయన గుర్తు చేశారు....

Tdp Mahanadu: రాష్ట్ర విభజనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విభజనతో రాష్ట్రానికి రెండు దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. విభజనతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌(Hyderabad) తెలంగాణ(Telangana)ను వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. తాను బాధపడలేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసున్నారు. విభజన జరిగిన తర్వాత బాధపడకుండా 2014 నుంచి 2019 వరకూ చాలా కష్టపడి పని చేశామని తెలిపారు. అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతులు ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్‌లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు భూములిచ్చారని, ఇదొక చరిత్ర అని చెప్పారు. మళ్లీ పూలింగ్ చేపడితే ఇప్పుడు కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. టీడీపీ, నాయకుడిపై నమ్మకంతో రైతులు భూములిచ్చేందుకు వచ్చారన్నారు. అయితే ఓ వ్యక్తి అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చివేశారన్నారు. కలెక్టర్ మీటింగ్ పెట్టి అప్పుడే కూలగొట్టారని గుర్తు చేశారు. ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని దివాళా తీయించారని, అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చారని మండిపడ్డారు. కేంద్రం నిధులను డైవర్ట్ చేశారని, పథకాలు నిర్వీర్యం చేశారని, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story