- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా లక్ష్యం అదే.. విద్యుత్ కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించి, వినియోగదారులపై భారం తగ్గించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను 4.60 రూపాయలకు తగ్గించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు...

ది, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు(Electricity Purchase) ఖర్చులను తగ్గించి, వినియోగదారులపై భారం తగ్గించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. విద్యుత్ శాఖ(Electricity Department)పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను 4.60 రూపాయలకు తగ్గించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయ ఇంధన వనరుల కంటే పునరుత్పాదక ఇంధన (Renewable Energy) ఉత్పత్తిని భారీగా పెంచడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
ఇంధన రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులపై పరిశోధనలు చేసేందుకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదేనని (EVs), వీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్ర పథకాల అమలులో ఏపీ ముందంజ
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్య ఘర్, కుసుమ్ (KUSUM) అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత కాలంలోగా చేరుకునేలా కార్యాచరణ ఉండాలని, క్షేత్రస్థాయిలో ఈ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్ శాఖలో జవాబుదారీతనం పెంచడం ద్వారా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మొక్కజొన్న రైతుల కోసం సీఎం కీలక అడుగు.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ






