- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరింత వేగంగా జీఎస్టీ వసూళ్లు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
జీఎస్టీ వసూళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: జీఎస్టీ(GST) వసూళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు(Undavalli CM Camp) కార్యాలయంలో నిర్వహించిన కేంద్ర-రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం(Coordination meeting of Central-State GST officials)లో పాల్గొన్న ఆయన రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్‌గా ఉండాలని సూచించారు. పన్ను వసూళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పన్ను ఎగవేతలను అడ్డుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్ లాంటి టెక్నాలజీని వినియోగించాలని చెప్పారు. దేశ సంపదను పెంచడంతో పాటు ఆ డబ్బును ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జీఎస్టీ వసూళ్ల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
Next Story






