- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నదుల అనుసంధానంపై సీఎం కీలక ప్రకటన
వ్యవసాయాన్నిలాభసాటిగా చేసి అన్నదాతల బతుకుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయాన్ని(Forming)లాభసాటిగా చేసి అన్నదాతల బతుకుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తీవ్రంగా కృషి చేస్తోంది. కృష్ణా, గోదావరి నదుల(Krishna, Godavari Rivers) అనుసంధానం చేస్తే రైతుల భవిష్యత్తంతా ఆనందదాయకంగా ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. ఇందులో భాగంగా నదుల అనుసంధానానికి నడుం బిగించారు. గతంలో పట్టుసీమ ద్వారా రైతులకు నీళ్లిచ్చారు.. ఇప్పుడు మరిన్ని చోట్ల నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశామలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు కడప జిల్లా పెండ్లిమర్రి(Pendimarri)లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేసిన ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదుల అనుసంధానం నుంచి వెనక్కి తగ్గమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని తెలిపారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. కృష్ణా, గోదావరితో పాటు రాష్ట్రంలో చాలా నదులున్నాయని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా అన్నిరిజర్వాయర్లలో నీళ్లు నింపితే సంవత్సరం పాటు వర్షాలు పడకపోయినా పుష్కలంగా నీళ్లుంటాయని చెప్పారు. నదుల అనుసంధానంతో ‘‘అన్ని చెరువులు నింపొచ్చు.. భూగర్భ జలాలు పెంచవచ్చు. అసలు భూమినే జలాశయంగా మార్చొచ్చు.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. డిమాండ్ ఆధారిత పంటలు సాగు చేస్తే ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేయొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.






