‘హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది’.. సీఎం చంద్రబాబు ప్రశంస

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-21 08:18:54  IST  )

జార్జియాలో జరుగుతున్న ఫీడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

‘హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది’.. సీఎం చంద్రబాబు ప్రశంస
X

దిశ,వెబ్‌డెస్క్: జార్జియాలో జరుగుతున్న ఫీడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌లో సెమీస్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా ఆమె ఘనగ సాధించింది. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పై భారత్ లోని ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Nara lokesh) కోనేరు హంపి అంతర్జాతీయ వేదికపై మరింత ప్రకాశించాలని ఆకాంక్షించారు. ఫీడే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు చేరిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన రికార్డు సాధించారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ తరుణంలో ‘‘హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. భారతీయ చెస్‌కు గర్వకారణం. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. టైటిల్‌ను ఇంటికి తీసుకురావాలని’’ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కోరారు.

Next Story