- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షో: పెట్టుబడులకు సీఎం ఆహ్వానం
సింగపూర్‌లో జరుగుతున్న బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో పెట్టుబడులను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) సింగపూర్(Singapore)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి రోజు పూర్తి అయి రెండో రోజు కూడా సింగపూర్‌లో పలు ప్రాజెక్టులను చంద్రబాబు టీమ్ సందర్శించారు. తాజాగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు సన్నాహక సమావేశంగా సింగపూర్ దేశంలో ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో నిర్వహిస్తు్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొత్త పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్సు, ఆటోమొబైల్ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని ఈ రోడ్ షో వేదికగా సింగపూర్‌లోని దిగ్గజ కంపెనీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.






