కుట్రలను దాటాం.. వేధించినా సాధించాం: అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అమరావతి ఉత్తరాయునిపాలెంలో సంబురాలు నిర్వహించారు...

కుట్రలను దాటాం.. వేధించినా సాధించాం: అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) ఏకైక రాజధాని(Capital)గా అమరావతి(Amaravati)కి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అమరావతి ఉత్తరాయునిపాలెంలో సంబురాలు నిర్వహించారు. ‘విజయం జరుపుకుందాం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వంలో జరిగిన ఆరాచకాలను గుర్తు చేశారు. అలాగే రైతులు చేసిన త్యాగాన్ని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అభినందించారు. రాజధాని కోసం సేకరించిన భూముల అంశంపైనా ఆయన ప్రస్తావించారు. అటు ప్రభుత్వం చేసిన అరచకాలు, దాడులపై గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంత వేధించినా..

ఎన్ని వేధింపులకు గురిచేసినా రైతులు పట్టుదలపై ఆయన ప్రశంసలు కురిపించారు. చరిత్రలో చూడని ఉద్యమాన్ని చూశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉద్యమ సమయంలో డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నామని, జోలి పట్టి ప్రజల నుంచి మద్దతు కోరామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో రాజధానికి రావాలంటే అడ్డుకునే పరిస్థితి ఉందని తెలిపారు. ఒక అడుగు వెనక్కి వేసైనా సరే గెలుద్దామని పవన్ కల్యాణ్‌కు చెప్పానని చంద్రబాబు తెలిపారు. మూడు ముక్కలాటతో జగన్ చేసిన డ్రామాను ప్రజలందరూ చూశారని విమర్శించారు. కుట్రలన్నింటినీ దాటుకుని రాజధానిని సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు కూటమికి మద్దతు తెలిపాయని చెప్పారు. చరిత్ర ఉన్నంత వరకూ అమరావతి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా అమరావతి ఉంటుందని పేర్కొన్నారు.

Next Story