ఎట్టకేలకు రాజధానిలో సొంతిల్లు.. భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-09 04:35:26  IST  )

ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సొంతిల్లు నిర్మించుకుంటున్నారు...

ఎట్టకేలకు రాజధానిలో సొంతిల్లు.. భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సొంతిల్లు నిర్మించుకుంటున్నారు. ఇందుకోసం వెలగపూడి(Velagapudi)లోని E-6 రహదారిలో 5.25ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ స్థలంలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం తెల్లవారుజామున భూమి పూజ(Bhumi Puja) చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)తో పాటు బ్రాహ్మిణి పాల్గొన్నారు. ఏపీ రాజధాని(Ap Capital)లో సొంతిల్లు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజధానిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంకితమివ్వాలనదే తమ ప్రధాన ధ్యేయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు రావాలని కోరుకున్నారు.

Next Story