Madanapalle Incident: నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం: CM చంద్రబాబు

by Gantepaka Srikanth |

మదనపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Madanapalle Incident: నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం: CM చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: మదనపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులతో చంద్రబాబు, నారా లోకేష్ ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని వదిలిపెట్టబోమని చెప్పారు. అసలేం జరిగిందంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లోనే పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి.. డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు. కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ స్థానిక మహిళలతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story