గూగుల్‌తో ఏపీ ఒప్పందం.. ప్రధాని మోడీకి ఆహ్వానం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-13 12:22:10  IST  )

విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఒప్పందం కార్యక్రమానికి రావాలని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు..

గూగుల్‌తో ఏపీ ఒప్పందం.. ప్రధాని మోడీకి ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ(Visakha)లో గూగుల్(Google) అనుబంధ సంస్థ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ప్రధాని మోడీ(Pm Modi) సమక్షంలో చేసుకోనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో మోడీని కలిశారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్‌‌ ద్వారా విశాఖలో రూ. 84 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కార్యక్రమం మంగళవారం జరగనుందని, తమరు హాజరుకావాలని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంట మోడీని కలిసేందుకు కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు వెళ్లారు.

Next Story