- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి 'మొంథా' తుపాను ముప్పు... కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో 'మొంథా' తుపాను నేపథ్యంలో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి 'మొంథా' తుపాను(Montha Cyclone) పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనుందని, వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేశారని, ఈ నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నుంచి తిరుపతి(Tirupati) వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని చెప్పారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుపాను రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తుపానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడ(Kakinanda)లో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.






