వేట్లపాలెం విస్పోటనం స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుళ్ల ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ..

వేట్లపాలెం విస్పోటనం స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada) వేట్లపాలెం(Vetlapalem) పేలుళ్ల ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పరిశీలించారు. పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి జరిగిన సహాయక చర్యలపైనా ఆరా తీశారు. ఘటన తీవ్రతను సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing center) ఎవరిదని, ఎప్పటి నుంచి ఉందని, అనుమతులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. అటు క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లనున్నారు.

Next Story