విశాఖలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-29 12:00:05  IST  )

విశాఖలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు..

విశాఖలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)ను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. విశాఖను ఇప్పటికే ఐటీ హబ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులకు శుక్రవారం సీఎం చంద్రబాబు(Cm Chandrababu) జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్‌(Rk Beach) నుంచి తొట్లకొండ వరకు బస్సులు(Buses) నడవనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో విశాఖకు పోటీ. విశాఖ ఆర్థిక రాజధానిగా, టెక్‌ హబ్‌గా ఎదగబోతోంది. విశాఖలో డేటా సెంటర్‌, సీ కేబుల్ ఏర్పాటు కానున్నాయి. గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పారు. రాజధాని వద్దని విశాఖ వాసులు తీర్పు ఇచ్చారు.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story