- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ స్టీల్ ప్లాంట్.. కొత్త విధానాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు సహకరించిన యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వ అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.
విశాఖ ఉక్కుకు పూర్తి సహకారం
2024-25 సెకండ్ క్వార్టర్ లో కేవలం రోజుకు 9,215 టన్నుల మాత్రమే ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు పనిచేస్తుండడంతో హాట్ మెటల్ ప్రొడక్షన్ లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తి కి చేరుకుంది. ఆర్దికంగా నష్టాల నుంచి లాభాల వైపు విశాఖ స్టీల్ ఉత్పత్తి సాధిస్తున్నది. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశ పెట్టి ప్లాంట్ ను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.






