- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా వాడకం తగ్గిస్తే ప్రతి కట్టకు రూ. 800.. ప్రభుత్వం కీలక ప్రకటన
యూరియా కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న యూరియా(Urea) కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని దాని వల్ల మిరపను చైనా నుంచి తిప్పి పంపారని తెలిపారు.. కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. యూరియా వాడని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం ఇస్తామని చెప్పారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని అధికారులకు సూచించారు. యూరియా కొరత లేదని, అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు.






