- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సముద్రంలోకి భారీగా కృష్ణా వాటర్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇరిగేషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Rains)తో సముద్రంలోకి భారీగా వరద ప్రవాహం(Water Floating) పోతోంది. దీంతో ఈ నీటిని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం(Ap Government) ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla) నిర్మించి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అడుగులు వేస్తున్నారు. అయితే కొన్ని అభ్యంతరాల వల్లే బనకచర్ల నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. ఇదిలా ఉంటే ఈసారి కూడా సముద్రంలోకి వరద ప్రవాహం వృథాగా పోయింది.
అయినా సరే హంద్రీనీవా(Handreeniva) ద్వారా సీమ జిల్లాల(Border Districts)కు సీఎం చంద్రబాబు కృష్ణా జలాల(Krishna water)ను అందజేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80శాతానికి పైగా రిజర్వాయర్లు నిండినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 310 టీఎంసీలు వినియోగించినట్లు తెలిపారు. హంద్రీనీవా ద్వారా సీమ జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లు తరలించినట్లు పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా కుప్పంకు సైతం కృష్ణానీళ్లు అందజేసినట్లు చెప్పారు. ఇక ఎగువ రాష్ట్రాల ప్రవాహాలతో సముద్రలోకి 1969 టీఎంసీలు వృథాగా పోయిందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో 1969 టీఎంసీలు సముద్రంలో చేరడంపై ఈ సమీక్షంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని పాజిబులిటీ ఉన్నంత వరకూ వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






